Thursday, October 11, 2007
హలో డియర్...
రోజులానే ఆఫీసు నుంచి బయలుదేరాను. దారిలో వుండగా నా స్నేహితురాలు సరిత ఫోను చేసింది. బాగున్నవా అంటూ హుషారుగా.. దాని గొంతు వినెసరికి నాకు కూడా ఎక్కడ లేని ఆనందం. అదెప్పుదొ ఇంటర్ లో క్లాసుమేటు. అప్పటినుంచి మంచి స్నెహితులం. ముందు అది US కి వచేసింది అందుకె నెను ఒంటరి గా రావడానికి కూద భయపడలేదు.ఏమిటే అంత ఆనందంగా వున్నావు అన్నాను అంతే హుషారుగా. నా గొంతులో కాస్త తేడా వచినా వెంటనే కనిపెట్టేస్తుంది. నేను ఇండియా వెళ్దామనుకుంటున్నానే, ఇప్పుడే టిక్కెట్లు కూడ బుక్ చేసుకొవడానికి వెళ్తున్నాను అంది. దీనికి ఆనందం వచినా ఏడుపొచినా అస్సలు ఆగదు. నాకు కూడ చాలా సంతొషం గా వుంది అది వినేసరికి. అదేదో నేనే వెళ్తున్నట్లు! ఏమిటే సడన్ గా? ఇండియా వెళ్ళి 2ఏళ్ళు అవుతుంది. గత 6నెలలు గా వెల్దామా వద్దా అని మధనపడుతుంది జాబ్ లో సెలవులు ఎక్కువ లేక. నిజానికి దానికి జాబ్ చెయ్యాల్సిన అవసరంలేదు. పుట్టింటి వారు అత్తింతి వారు బాగా సంపదించారు. అయినా స్త్రీ కి ఆర్దిక స్వతంత్ర్యం ముఖ్యమనే భావానికి ఎక్కువ విలువనిస్తుంది. అందుకె ఇంట్లో ఎవరికీ ఇష్టం లేకున్నా చదువు అయిపొగానే జాబ్ చూసుకుంది. మా చెల్లి కి పెళ్ళి కుదిరింది. ఒహ్! అయితే మన మానస పెళ్ళికూతురు కాబోతుంది అన్నను, మనసు లో పెళ్ళి ని ఊహించేసుకుంటూ.నా పెళ్ళి నాటి సంగతులు గుర్తొచాయి. ఎవరికైనా పెళ్ళి కుదిరితె చాలు వెంతనె వచె ప్రస్న: ఎవరె ఆ బకరా బాబు అని! కాలెజీ రోజుల్లొ ఎమీ తెలిసేది కాదు.పెళ్ళి గురించి బాధే లెదు. అమ్మ, నాన్న, చదువు, స్నెహితులు, సరదాలు, ఇదే లోకం గా గడిచిపొయెది. అందుకె పెళ్ళంతె అవతలి వాదిని బకరా చెయ్యడమె అనుకునె వాళ్ళం. పెళ్ళయ్యక కానీ తెలియలెదు ఆ హ్యపీ డేస్ అంతటితో అయిప్యాయి అని. ఇప్పుదు మానస వంతు అని నవుకున్నాం ఇద్దరం. ఆ విషయం ఈ విషయం మాట్లాడుకుంటూ 30నిమిషాలు అయిపొయాయి. నిజానికి ఆ సమయం చాలా తక్కువే. హస్క్ స్టార్ట్ చెస్తే గంట మాట్లాడుకునేవాళ్ళం. సరే, వీకెండ్ లో కాల్ చెస్తాలే, మళ్ళీ వంట కి లేటు అవుతుంది అంటూ ఫోను పెట్టేసింది. అంతలో నేను కూడా ఇంటికి వచెసాను.ఇక మనం కూడా వంట మొదలుపెడదాం అసలే శ్రీవారు వచే వేళ్ళయ్యింది అనుకుంటూ వంట గదిలోకి బయలుదేరాను.
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
1hr in daily life :):) just happens this way only..
Post a Comment