Sunday, October 14, 2007

విమాన విన్యాసాలు

రేపు వీకెండ్ వచేస్తుంది, హమ్మయ్య కాస్త రెస్ట్ తీసుకోవచు అనుకుంటు ఆఫీసులో త్వరగా పని ముగించుకొని మేనేజరు డెస్క్ వైపు చూసాను వెళ్ళాడ లేదా అన్నట్లు. అతని కంటె ముందు బయలుదేరినా కష్టమే. తనొక్కడే పని చెస్తున్నాడు మిగతా అందరు ఊరికే జీతాలు తీసుకుంటున్నారు అని ఫీల్ అయిపొతాడు. అందుకే మేమందరము(అన్నట్లు మా టీం లొ మొత్తం 5మంది) మేనేజరు వెళ్ళాకే వెళ్తుంటాం. శుక్రవారం కదా ముందే సర్దేసినట్లున్నాడు. అతన్ని వెళ్ళనిచి నేను కూడ ఇంటికి బయలుదేరాను. ఇంతలో నా టీం మేటు హరి కూడ లేచాడు. వీకెండ్ ప్లాన్స్ మాట్లాడుకుంటూ కారు పార్కింగ్ వైపు బయలుదేరాము. హరి కి ఇంకా పెళ్ళి కాలేదు వీకెండ్ అంతా మూవీస్, స్నెహితులు, నిద్ర తో గడిచిపోతుంది. సోమవారం రాగానే చూసిన కొత్త సినిమాల గురుంచి చెప్తుంటాడు. అందుకే మాకు మూవీస్ గురుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెలిసిపోతుంది.నాకు ఇంట్లో పని,స్నేహితులు, బంధువులు రాకపోకలతో ఇట్టే అయిపోయినట్లనపిస్తుంది. ఈ వీకెండ్ శ్రీవారితో ఒంటరిగా గడపాలి అని ఎవ్వరినీ ఇంటికి పిలవలేదు. ఇంటికి రాగానే వంట త్వరగా చేసి విజయ్ కోసం ఎదురుచూస్తూ నువ్వె-నువ్వె సినిమా పెట్టుకొని సొఫా లో కుర్చున్నా. 9 గంటలకి మా వారు వచారు. వీకెండ్ అని కాబొలు హుషారుగా వున్నాడు.రేపు మనం ప్రొద్దున్నే లేవాలి అన్నాడు చేతులు కడుక్కుంటు.వీకెండ్ లో టూరు కి తప్ప విజయ్ 11 గంటల వరకు అస్సలు నిద్ర లేవడు. టూర్ వుంటే చాలు అస్సలు నిద్ర పోడు. అంత ఇష్టం తనకి టూర్లంటే. నాకు ఊహ తెలిశాక నేను చూసింది తిరుపతి అంతకుమించి ఈ ప్రదేశానికి వెళ్ళలేదు. అలాంటిది పెళ్ళయ్యాక విజయ్ నాకు ఇండియా అంతా చూపించేసాడు. అమెరికా కు వచి 6నెలలు కూడ కాలేదు. ఇంతలోనే 3 ప్రదేశాలకి తీసుకెళ్ళాడు. అబ్బా లేదండి,ఈ వీకెండ్ పుర్తిగా రెస్ట్ తీసుకుందామనుకుంటున్నాను.నేను రాను అని నిక్కచిగా చెప్పాను. మొత్తానికి బతిమాలి వెళ్ళే ప్రదేశం బాగుంటుందని చెప్పి ఒప్పించాడు. ఇష్టం లేకున్నా సరే అని చెప్పాను. ప్రొద్దున్నే లేచి సణుగుతూ బయలుదేరాను 'కేవలం నీకొసమే వస్తున్నానూ అన్నట్లుగా'.సరే అని చెప్పాను. ప్రొద్దున్నే లేచి సణుగుతూ బయలుదేరాను 'కేవలం నీకొసమే వస్తున్నానూ అన్నట్లుగా'.సరే అని చెప్పాను. ప్రొద్దున్నే లేచి సణుగుతూ బయలుదేరాను 'కేవలం నీకొసమే వస్తున్నానూ అన్నట్లుగా'.మూడు గంటలు ప్రయాణం. అప్పుడే వర్షం కురిసినట్లుంది రోడ్డంతా తడిసి కనిపిస్తుంది. చెట్లు,చేమలు అందం అయితే చెప్పక్కర్లేదు.మంచి గాలి, ఆహ్లందం గా పలకరించి వెళ్తుంది. చాలా రోజుల తర్వాత ప్రక్రుతి అందాన్ని ఆస్వాదిస్తున్నాను.మా పల్లెటూరు గుర్తొచింది. మనసు కి ఎంతో హయిగా అనిపించింది. థాంక్యూ విజయ్ అని నవ్వుతూ చెప్పాను. హమయ్య నీకు నచింది ఇప్పుడు నాకు సంతొషం గా వుంది. ఇద్దరం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ విమాన విన్యసాలు షో వైపు కి మరింత వేగంతో బయలుదేరాము.అప్పటికే జనాలు కిక్కిరిసి పోయారు.బాగుంటుంది కాబోలు అనుకుంటూ మా సీట్లు వెతికి కుర్చొని స్టేడియం చూసాము. చాలా పెద్దది గా వుంది. ఇంతలో కామెంట్రి ప్రారంభం అయ్యింది. F-16, F18, Thunderbirds, ఒకదాని వెంట ఒకటి గాలిలొ విన్యాసాలు చెయ్యడం మొదలు పెట్టాయి. ప్రేక్షకులలో ఉత్ఖంట, ఆశ్చర్యం, ఆనందం, చప్పట్లు, కేరింతలు. గాలి లో అలా ఫీట్లు చెయ్యడానికి ఎంత ధైర్యం కావాలి! అది కూడ పల్టీలు కొట్టడం. చూడడానికి రెండు కళ్ళు చాల్లేదు. షో అయిపొగానే ఇంటికి కాల్ చేసి చెప్పాను తప్పకుండా బెంగళూరు లో ఎయిర్ ఫొర్స్ వాళ్ళు ప్రతి ఏడాది నిర్వహించే విమాన విన్యాశాలని చూడమని. మిస్ అవ్వకుండా తప్పకుండా చుస్తారు కదూ! అన్నట్లు నేను కొన్ని వీడియోలని ఇక్కడ పెట్టాను.

No comments: