Friday, October 19, 2007

ఓ మంచి మాట

పని ముగించుకొని ఇక ఇంటికి బయలుదేరుదామని నా బాగ్,బాక్స్ సర్దుకున్నాను. శాంతి కి కూడా చెప్పి బయలుదేరుదామని తన సీట్ కి వెళ్ళాను. శాంతి మా కంపెనీ లో కొత్తగా చేరింది.మాకు ఇరుగు పొరుగు కూడా. కలిసి పోయే మనస్తత్వం. అందుకే వచ్చిన నెల లోనే మంచి స్నేహితురాలు అయ్యింది.ఇద్దరం కలిసే వెళ్తుంటాం ఇంటికి వీలైనంతవరకు. నా పని కూడా అయిపోయింది.నా కంప్యూటర్ ఆఫ్ చేసి వస్తాను, 5నిమిషాలు ప్లీజ్ అంది.మాలో చాలా మంది ఏ నెలకో లేక ఎప్పుడో పని లో ఎదైనా సమస్య వస్తే తప్పితే కంప్యూటర్లు ఆఫ్ చెయ్యము.అందుకే నేను ఆశ్చర్యం గా అడిగాను రోజూ ఆఫ్ చేస్తావా అని.ఔను అంది చాలా సౌమ్యంగా. అనవసరంగా 5నిమిషాలు వ్యర్దం చేస్తున్నావ్ అనే ఫీలింగ్ తో ఎందుకు అని అడిగాను.రోజూ వింటున్నాం కదా 'గ్లోబల్ వార్మింగ్' గురించి,నేను దాన్ని పూర్తిగా ఆపలేను.కాని నాకు చేతనైనంతవరకు ఎనర్జీ ని సేవ్ చెయ్యలని వుంది అందుకే పని అయిపోగానే పవర్ ఆఫ్ చేస్తాను ఆఫీసులోను మరియు ఇంట్లోను అంటున్న తనని చూసి చాలా ముచ్చట వేసింది. నేను కూడా నా సిస్టం ఆఫ్ చేసి ఇంటికి బయలుదేరాము.మీరు చేసే మంచి పనులను ఇక్కడ పంచుకోండి.ఎవరో ఒకరు మీ ఆలోచనని సమర్ధించినా ఆనందమే కదా!

No comments: