Wednesday, October 17, 2007

చిరంజీవి కూతురి పెళ్ళి

ఈరోజు పేపర్ అంతా చిరంజీవి కూతురి పెళ్ళి గురించే న్యూస్. ప్రొద్దున్నే ఫ్రెండ్ నుంచి మెయిల్, తెలుసా! చిరంజీవి రెండొ కూతురు వెళ్ళిపోయి పెళ్ళి చేసుకుందట, శ్రీజ (పెళ్ళికూతురు) వయసు, పెళ్ళికొడుకు వివరాలు,వీడియో పంపించింది.ఆ వార్త వినేసరికి ఎక్కడో బాధ.అయ్యో!పాపం వెళ్ళిపొయిందా(చిరంజీవి కూతురు కాబట్టి చాలా మర్యాదగా 'వెళ్ళిపొయింది'అన్నారు) అనుకున్నాను.తండ్రి కి ఎంత పలుకుబడి వుంది,ఏవి పట్టించుకోకుండా తన స్వార్దానికి వెళ్ళిపొయిందే అనుకుంటూ మళ్ళీ పేపర్ తిరగేసాను.వాళ్ళు పెళ్ళి చేసుకున్న తీరు చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది.ఎంత పకడ్బందీ గా వ్యవహరించారు, సిడీ లు తీసి అన్నీ రెడీ గా పెట్టుకొని, వీళ్ళ ప్లాన్ చూస్తుంటే ఏదో పెద్ద ఆలోచనకి శ్రీకారం చుట్టారనిపిస్తుంది. పిల్లల్లు, శ్రీవారు వచ్చే వేళ్ళయ్యింది అని గబ గబా వంట చేసి మళ్ళీ ఇంటర్నెట్ ముందు కూర్చున్నాను.ఆ న్యూస్ చూస్తు ఆలొచనల్లోకి వెళ్ళిపొయా.నాకు కూతురు వుంది.అమ్మో రేపు నా కూతురు ఇలాంటిదేమైనా చేస్తే, ఊహించుకోవడానికే భయం గా వుంది.ఎందుకు పిల్లలు,పెద్దలు కూర్చుని మాట్లాడుకోరు, అనే ప్రశ్న నాకు చాలా ఏళ్ళ నుంచి వుంది.నా స్నేహితుల్లోను చాలామంది ఇలా ఇంట్లొంచి వెళ్ళిపోయి చేసుకున్నవాళ్ళు వున్నారు.ఆ తర్వాత వాళ్ళ తల్లితండ్రులు మా దగ్గరకి వచ్చి బాధ పడడం, ఇలాంటివి చాలానే చూశాను. వెళ్ళిపోయి పెళ్ళి చేసుకున్న వాళ్ళందరూ బాగున్నారని చెప్పను.చాలావరకు ఇరువైపులా బాధ పడడమే ఎక్కువ చూశాను.నా కూతురు తో ఎలా మెలగాలా అని దీర్ఘంగా ఆలొచిస్తుంటె మావారు వచ్చారు ఈరోజు న్యూస్ చూసావా అంటూ. బాధేసింది అనేలోపే,మా ఆయన, మొత్తానికి చిరంజీవి కి పిల్లల్ని పెంచడం రాలేదు అన్నాడు.ఔరా!పిల్లలు చేసినదానికి తండ్రినా అనేది!పిల్లల్లు దీన్ని ఎందుకు అర్థం చేసుకోరో కదా!ఎప్పుడీ అంతరం తొలగేది.

No comments: