Sunday, October 21, 2007

వీడికెంత పొగరు!

మమ్మీ అంటూ పరిగెత్తుతూ వచ్చాడు నా చిన్నకొడుకు విజయ్. మళ్ళీ ఏమి దెబ్బ తగిలించుకున్నావు రా, ఎక్కడ పడ్డావ్ అని కంగారుపడుతూ ఇంట్లోంచి మందు పట్టుకొని వచ్చాను.వీడు గడుగ్గాయి మరియు మహా అల్లరి వాడు.దెబ్బలు ఎక్కువగా తగిలించుకుంటుంటాడు అందుకే డెట్టాల్, ఆయింటమెంట్ రెడీ గా పెట్టుకుంటాను. నేను తెచ్చేలోపలే వాళ్ళ తాతయ్య వాణ్ణి దగ్గరకి తీసుకొని గాయాన్ని కడుగుతున్నారు.వాదు అంతా బానే కడిగించుకొని మందు వేయించుకొని,మళ్ళీ ఆడుకొని వస్తా అంటూ వెళ్ళబోతున్నవాడిని, ఒరేయ్,మనవడా, ఒక ముద్దు ఇచ్చి పోరా అని అడిగారు.పో తాతయ్య, నీ దగ్గర చుట్టకంపు,నువ్వు బాగా ముఖం కడుక్కొని రా అప్పుడు పెడతా అని టాటా చెప్పి పరిగెత్తుకుంటూ బయటకి వెళ్ళిపోయాడు.వీడికెంత పొగరు,ఇప్పటి వరకు ఆయన ఒడిలో కూర్చొని మందు వేయించుకున్నాడు,ముద్దు అడిగేసరికి చుట్టవాసన అని చెప్తాడా, ఈ కాలం పిల్లల్ల కు సమాధానం చెప్పడం కష్టం అని లోలోపలే నవ్వుకుంటూ మళ్ళీ పనిలోకి వెళ్ళిపోయా.

No comments: