Monday, October 15, 2007

కాలం కలిసొచ్చిందోయ్!

ఎవండోయ్, ఈ మాట విన్నారా అంటూ పెద్దగా కేకేసుకుంటు లోపలికి వచ్చింది గిరిజ. అబ్బా, మీకెప్పుడు నిద్రే, పక్కింటి సుధాకర్ గారిని చూడండి ఎప్పుడు క్షణం తీరిక లేకుండా డబ్బు సంపాదిస్తున్నాడు. ప్రొద్దున్నే మొదలయ్యిందా నీ గోల, ప్రశాంతంగా ఆదివారం పూట కూడ పడుకోనివ్వవు అని విసుక్కుంటూ దుప్పటి నిండుగా కప్పేసుకున్నాడు. వినండి, సుధాకర్ వాళ్ళు కొన్న పొలం పక్కన రాంకో కంపెనీ 50 ఎకరాలు కొనుగోలు చేసిందట.ఇప్పుడు ఆయన 5 ఎకరాల పొలాన్ని కోటి రూపాయలకి అడుగుతున్నారు. ఎంత అదృష్టం! మీరు ముసుగేసుకొని పడుకుంటే లాభం లేదు. మనం కూడా కోట్లు సంపాదించాలి.ఇంక పడుకోనివ్వదని అర్థమై పొయింది సుధాకర్ కి, మంచం నుంచి దిగుతూ ఏమి చేస్తావ్ కోటి రూపాయలతో,గిరిజ అని అడిగాడు.అబ్బా మీదగ్గర వున్నట్లు ఏమి అడుగుతున్నారు, కోటి సంపాదిస్తే చాలండి, ఇక లైఫ్ లో సెటిల్ అయిపోయినట్లే, మనకి దిగులే వుండదు అంది సంబరంగా. సుధకర్ కి గిరిజ కి పెళ్ళై 2సంవత్సరాలు అయ్యింది. ఆర్ధికంగా నిలదొక్కుకున్నాకే పిల్లల్ని కనాలి అని ఇప్పటివరకు ఆగారు.పుట్టింటి వాళ్ళు, అత్తింటి వాళ్ళు పిల్లల కోసం పోరు పెడుతున్నా ఇంకో 2ఏళ్ళ వరకు కనేది లేదని నిక్కచ్చి గా చెప్పారు.ఈ కాలం పిల్లలకి అస్సలు చెప్పలేము కదా, మా మాట వింటేగా వీళ్ళు అని పెద్దవాళ్ళ దగ్గర్నుంచి నిట్టూర్పులు.వీరిద్దరు ప్రస్తుతం డబ్బు సంపాదనే ధ్యేయంగా పెట్టుకున్నారు.అందుకే రకరకాల ఇన్వెస్టమెంటుల గురుంచి రొజూ ఆలోచిస్తుంటారు.చాలామంది యవత ఈ మధ్య ఇలానే ఆలోచిస్తున్నారు.ఇది ఆహ్వనించదగిన మార్పే కానీ తలకు మించిన భారం వేసుకోకూడదు. ఆరోగ్యం,ఆనందం, బంధాలు అన్నీ అవసరమే. ఎలాగైనా 2ఏళ్ళలో కోటి సంపాదించి సుధాకర్ గిరిజ కళ్ళలో తృప్తి చూడాలి అనుకొని బాగా ఆలోచించి భూమి మీదే పెట్టుబడి పెట్టాలనుకున్నాడు. హైదరాబాద్ కి 100కిలోమీటర్ల దూరం లో సంసులూరు అనే ప్రాంతంలో 5 లక్షలు పెట్టి 1000 గజాలు,గిజవాడ ప్రాతంలో మరో 1500 గజాలు కొన్నాడు. మరో 5ఏళ్ళలో అయినా పెరుగుతుంది కదా అనే ఆశతో! మన మంత్రి గారు ఒకరు ఆ దారిన అనుకోకుండా వెళ్ళాల్సి వచ్చింది. అది బాగా వెనకబడిన గ్రామం అని అర్ధమయ్యింది.దీన్ని అభివృద్ధి చేసే పేరుతో మనం ఎలా డబ్బులు సంపాదించాలా అని తెగ ఆలోచించిన మంత్రి గారికి థక్కున ఒక అయిడియా వచ్చింది.ఇక ఆలస్యం చేయకుండా అక్కడ 100ఎకరాల ని తన డ్రైవర్ పేరుతో కొనేసాడు.తన పలుకుబడి అంతా ఉపయోగించి ఆ ప్రాంతాన్ని సెజ్ కింద తీసుకొచ్చాడు. ఇంకేముంది అక్కడ బడా వ్యాపారులు రావడం, రియలు ఎస్టేటు వాళ్ళ కన్ను పడడం,గజం 10000 కావడం మూణ్ణెల్లు తిరక్కుండానే జరిగిపోయింది.ఇక గిజవాడ ఎంత బాగా అభివృద్ధి చెందిందో అని లెక్కలేసుకుంటూ అటు వైపు బయలుదేరాడు.తీరా వెళ్ళి చూస్తె అక్కడ ఎర్ర జండాలు పాతిపెట్టి జనాలు గుడిసెలు కూడ వేసుకొని వున్నారు. ఈ స్థలం నాది అంటూ వెళ్ళిన సుధాకర్ కి దేహశుద్ధి బాగా జరిగింది. సంసులూరు స్థలాన్నైనా కాపాడుకుందాం అని అటువైపు పరుగుదీశాడు!

No comments: